Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాల సమర్పణ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 19, 2026 2:32 PM హైదరాబాద్General
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాల సమర్పణ - Udayam
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో వెండి, బంగారు బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. మురాద్ మహల్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, బ్యాండు చప్పుళ్లు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...