Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Aug 30, 2026 6:41 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలో 11 కేవీ గాంధీనగర్ ఫీడర్ మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని డీఈ కె.గంగారాం తెలిపారు. తీన్‌ఖని చౌరస్తా, పెద్దమసీదు, కటికెవాడ, మంచినీళ్లబావి, ఇస్లాంపుర, గాంధీనగర్, ఉప్పరిపేట, తెనుగువాడ, దగ్గులమ్మ, ఉస్మాన్‌పుర, మహబూబ్‌, రహ్మత్‌పుర, ప్యారా బాయ్, గోరేమియా, ఖిలాగడ్డ, తులసీనగర్ ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందన్నారు.

Comments

G
Loading comments...