Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో పితృపక్షాల సందర్బంగా సామూహిక పిండ ప్రదానాలు

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 7:34 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో పితృపక్షాల సందర్బంగా సామూహిక పిండ ప్రదానాలు - Udayam
జగిత్యాలలో పితృపక్షాలను పురస్కరించుకుని విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక పిండ ప్రదానాలు, తర్పణాలు నిర్వహించారు. పరివార్ అధ్యక్షులు కొమురవెల్లి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాసం అశోక్ గుప్త ఆధ్వర్యంలో గాయత్రీ యజ్ఞం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో పరివార్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...