వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడిన తీరుపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌ను నటుడు జగపతి బాబు తీవ్రంగా ఖండించారు. ఒత్తిడి కారణంగా చిన్న విషయాలు మర్చిపోవడం సహజమని, పనిలేని వాళ్లే ఇలాంటి పనులకు దిగుతారని ఆయన మండిపడ్డారు.
సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని వదిలేసి చిన్న విషయాలను పెద్దది చేయడం సరికాదని జగపతి బాబు అన్నారు. గతంలో తనపై కూడా ఇలాగే 80 టేక్స్ తీసుకున్నానంటూ ఫేక్ ప్రచారం చేశారని, ట్రోలింగ్ చేసే వారిని తాను అస్సలు పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు
Comments
Loading comments...

