Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కూడో పోటీలకు కలిగిరి విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:57 PM నెల్లూరుGeneral
జాతీయ కూడో పోటీలకు కలిగిరి విద్యార్థి ఎంపిక - Udayam
కలిగిరి జడ్పీ హైస్కూల్‌ విద్యార్థి కె. నమో వెంకటేశ్‌ రాష్ట్ర స్థాయి కూడో పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ఇన్‌ఛార్జ్‌ హెచ్‌ఎం జి. వెంకటేశ్వర్లు విద్యార్థిని అభినందించి ప్రశంసాపత్రం, పతకాన్ని అందజేశారు. విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని హెచ్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో పీడీ వి. నరేంద్ర, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...