వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో ఐటీ టవర్

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవలను విస్తరించే లక్ష్యంతో కరీంనగర్‌లో రూ. 42 కోట్లతో ఐటీ టవర్‌ను నిర్మించారు. సుమారు 2,400 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.
ప్రస్తుతం 15 సంస్థలు తమ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఐటీ హబ్‌ను మరింత ప్రోత్సహిస్తే, స్థానిక ఇంజినీరింగ్ పట్టభద్రులు ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...