Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 2:21 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు - Udayam
కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని మూలవాగు ఇసుక రీచ్‌ వద్ద ఇసుక ట్రాక్టర్లను స్థానిక రైతులు గురువారం అడ్డుకున్నారు. గ్రామ అవసరాలకు కాకుండా ఇతర గ్రామాలకు ఇసుక తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతుంటే, భూగర్భ జలాలు అడుగంటిపోయేలా ఇసుక తరలించడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Comments

G
Loading comments...