Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇషా సింగ్‌ చేతికి స్వర్ణం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 27, 2026 9:53 PM జాతీయంక్రీడలు
ఇషా సింగ్‌ చేతికి స్వర్ణం - Udayam
హాంగ్‌ఝౌలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ అదరగొట్టింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఒలింపిక్‌ పతక విజేత మనూ బాకర్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఇషా సింగ్‌ 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్‌లో రెండో స్థానంలో నిలిచిన ఈ 21 ఏళ్ల షూటర్‌ తుది పోరులో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...