వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయాలని సర్పంచులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు ఆయన లేఖ రాశారు. సర్పంచుల ఫిర్యాదులు, ఆధారాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...
