వార్తలకు తిరిగి వెళ్లండి
బద్రీనాథ్ కానుకల చోరీపై విచారణ

బద్రీనాథ్ ధామ్‌లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే సంబంధిత సిబ్బంది నుంచి వివరణ కోరారు. అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే, బద్రీనాథ్ ఆలయ కమిటీ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Loading comments...