Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్!

భరత్ తేజ Jul 15, 2026 11:00 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
 ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్! - Udayam Digital
నటి హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్యారడాక్స్‌’ అధికారికంగా ప్రకటించబడింది. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు కిశోర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హన్సిక శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. మిస్టరీతో పాటు భావోద్వేగాలను మేళవించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, తన కెరీర్‌లో ప్రత్యేకం కానుందని చిత్రబృందం పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...