Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ రాజ్యంతో సంక్షోభం

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:48 PM వరంగల్General
ఇందిరమ్మ రాజ్యంతో సంక్షోభం - Udayam
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు ఎగవేత, ఎరువులు-విత్తనాల కొరతతో ప్రభుత్వం రైతులను అడ్డగోలుగా మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబుతామని, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...