వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 6E 2102 విమానం ఉదయం 9.16 గంటలకు బయలుదేరగా.. 9.30 గంటలకు ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
14 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 9.51 గంటలకు గోవాలో దించారు. ప్రయాణికులను సురక్షితంగా దించి, విమానాన్ని సాయంత్రం 3.30 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
Comments
Loading comments...

