Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 09, 2026 11:08 AM నిజామాబాద్General
ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ - Udayam
సర్కారు బడులపై నమ్మకం పెరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో సుమారు 5,111 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఉపాధ్యాయుల కృషి, ప్రజాప్రతినిధుల సహకారంతో సర్కారు బడులు కొత్త ప్రవేశాలతో కళకళలాడుతున్నాయి. ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య ఇందూరు జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు నాణ్యమైన బోధనపై భరోసా కల్పిస్తుండటంతో ప్రభుత్వ బడుల గడప తొక్కే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Comments

G
Loading comments...