వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంతతి గణనీయంగా పెరిగింది. తాజా గణనలో పులుల సంఖ్య 36 నుంచి 42కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 18 ఆడ, 14 మగ పులులతో పాటు 10 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
సంతానోత్పత్తి విజయవంతంగా సాగుతుండటం శుభపరిణామమని ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హిరేమత్ పేర్కొన్నారు. ఆడ పులులు ఎక్కువగా ఉండటం రిజర్వ్‌లోని ఆరోగ్యకరమైన పర్యావరణానికి నిదర్శనమని అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

