వార్తలకు తిరిగి వెళ్లండి
వృద్ధుడిపై దురుసుతనం: కానిస్టేబుల్ సస్పెన్షన్
రేఖ దేవి Jun 26, 2026 1:15 PM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్‌లో వృద్ధుడితో అమర్యాదగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్టేషన్‌లో టేబుల్‌పై కాళ్లు వేసి కూర్చున్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కఠిన చర్య తీసుకున్నారు.
పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా మెలగాలని సిబ్బందిని ఆదేశిస్తూ, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...