వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల మండలం ఈపురుపాలెంలో సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సోమవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక వసతులను పరిశీలించారు.
చిన్నారుల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. చిన్నారులకు ప్రతిరోజూ తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

