Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ ప్రక్రియలో తిరుపతిలో వేల నకిలీ ఓట్ల గుర్తింపు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 7:17 AM తిరుపతిGeneral
సర్‌ ప్రక్రియలో తిరుపతిలో వేల నకిలీ ఓట్ల గుర్తింపు - Udayam
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో తిరుపతి నియోజకవర్గంలో శాశ్వత వలసలు, చిరునామాలో లేనివారు, డూప్లికేట్‌ ఓట్లు ఉన్నవారి పేర్లను తొలగింపు జాబితాలో చేర్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 57,256 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 20,527 మంది చిరునామాలో లేరని, 6,349 మందికి డూప్లికేట్‌ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సరైన ఆధారాలు సమర్పిస్తేనే వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...