Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్‌కు హైదరాబాద్ జిమ్నాస్ట్

Follow Udayam on Google
రూప దేవి Jul 13, 2026 10:11 AM జాతీయంక్రీడలు
కామన్వెల్త్ గేమ్స్‌కు హైదరాబాద్ జిమ్నాస్ట్ - Udayam
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్-2026కు హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ ఎంపికయ్యారు. భారత ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జట్టుకు ఆమె ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న నిష్కా అగర్వాల్‌తో పాటు ఆమె కోచ్ మనోజ్ రాణా, సహాయక బృందాన్ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రత్యేకంగా అభినందించింది. క్రీడా వర్గాలు ఈమె ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...