వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగర సినీ ప్రియులకు ఏఎంబీ సినిమాస్ తీపి కబురు అందించింది. సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్ సంస్థలతో కలిసి నగరంలో సరికొత్త ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకప్పటి ప్రసిద్ధ 'సుదర్శన్ 70' థియేటర్ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది.
'ఏఎంబీ క్లాసిక్ విక్టరీ' పేరుతో రానున్న ఈ స్క్రీన్.. దాదాపు పుష్కరకాలం తర్వాత ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను హైదరాబాద్ ప్రేక్షకులకు తిరిగి తీసుకురాబోతోంది. దీని సీటింగ్ కెపాసిటీ, ప్రారంభ తేదీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.
Comments
Loading comments...

