వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకకు చెందిన బొట్ల చంద్రయ్య పెళ్లయిన ఆరు నెలలకే సౌదీ అరేబియా వెళ్లి, 44 ఏళ్ల తర్వాత బుధవారం మృతదేహమై భార్య లక్ష్మి చెంతకు చేరాడు. ఇన్నాళ్లు ఆయన కోసం ఎదురుచూసిన భార్య కన్నీటిపర్యంతమైంది.
అక్కడే కూలీ పనులు చేస్తూ మే 27న అతడు మరణించగా, తెలుగు సంఘాల కృషితో మృతదేహం స్వగ్రామానికి వచ్చింది. బుధవారం భార్య ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి.
Comments
Loading comments...

