వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగుచూసింది. బైపాస్ రోడ్ మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్‌పై ‘బయో హజార్డ్, ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన వ్యర్థాలను పడేసి వెళ్లారు. చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డు ఉన్నా వ్యర్థాలు పడేయడంపై చర్చ సాగింది. వీటిని శాస్త్రీయంగా నిర్మూలించాల్సి ఉండగా రోడ్డుపక్కన పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

