Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిని ఢీకొట్టిన వ్యక్తి దొరకలేదని ఆస్పత్రిలో కత్తితో హల్‌చల్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:26 AM జాతీయంGeneral
తల్లిని ఢీకొట్టిన వ్యక్తి దొరకలేదని ఆస్పత్రిలో కత్తితో హల్‌చల్‌ - Udayam
తన తల్లిని వాహనంతో ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించలేదన్న ఆగ్రహంతో బాలకృష్ణన్‌(35) శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి కత్తితో వచ్చి హల్‌చల్‌ చేశాడు. అతడి తల్లి మల్లికను ఈ నెల 25న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రోగులున్న వార్డులోకి వెళ్లిన బాలకృష్ణన్‌ పోలీసులను రప్పించాలని అక్కడున్న వారిని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...