Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డుకు చేయూత చెక్కును అందజేసిన ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 7:34 PM విజయనగరంGeneral
హోంగార్డుకు చేయూత చెక్కును అందజేసిన ఎస్పీ - Udayam
జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు జి.కృష్ణకు జిల్లా పోలీసుశాఖ చేయూత అందించింది. ఈ మేరకు హోంగార్డుల ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్‌తో సమకూరిన రూ.3,59,260 చెక్కును శనివారం జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆయనకు అందజేశారు. కుటుంబ సంక్షేమానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇంచార్జ్‌ ఆర్‌ఐ రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...