వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 13 మంది పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ వీరికి జ్ఞాపికలు అందించి వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు.
పదవీ విరమణ తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసు శాఖ అండగా ఉంటుందని అధికారులు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

