Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గృహలక్ష్మి’ పథకంలో భారీ అవకతవకలు

భవ్య శ్రీ Jun 27, 2026 11:03 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
‘గృహలక్ష్మి’ పథకంలో భారీ అవకతవకలు - Udayam Digital
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహలక్ష్మి’ పథకంలో భారీ లోపాలు బయటపడ్డాయి. మరణించిన సుమారు 2.88 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి దాదాపు ₹115 కోట్ల నిధులు బదిలీ అయినట్లు ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. మరణాల సమాచారం అప్‌డేట్ కావడంలో జరిగిన ఆలస్యం వల్లే ఈ నిధులు బదిలీ అయ్యాయని అధికారులు తెలిపారు. దుర్వినియోగమైన సొమ్ములో ఇప్పటివరకు కేవలం ₹15.24 కోట్లు మాత్రమే రికవరీ కాగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల సహాయంతో వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...