Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 12:23 PM శ్రీకాకుళంGeneral
హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు - Udayam
మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎం.సుధాకర్‌ అన్నారు. శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మైనర్‌ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...