Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వ్యక్తులకు గులాబీలు అందించి అభినందించిన ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 11:38 AM విజయనగరంGeneral
హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వ్యక్తులకు గులాబీలు అందించి అభినందించిన ఎస్ఐ - Udayam
విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణరావు గురువారం స్తానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలు రికార్డులు సక్రమంగా లేని కారణంగా వారికి ఆపరాధ రుసుం విధించారు. అలాగే హెల్మెట్‌ ధరించిన ప్రయాణిస్తున్న వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...