వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణల కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 303.67 పాయింట్లు నష్టపోయి 74,346.17 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 77.95 పాయింట్ల నష్టంతో 23,405.60 వద్ద క్లోజ్ అయ్యాయి.
సెన్సెక్స్‌లోని ప్రధాన కంపెనీల్లో టీసీఎస్ అత్యధికంగా 8.43 శాతం నష్టపోగా.. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా భారీగా క్షీణించాయి. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 40 పైసలు తగ్గి రూ.95.76 వద్ద ముగిసింది.
Comments
Loading comments...
