వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాలు: రైతు ఆశీర్వాద సభ వాయిదా

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో 'రైతు ఆశీర్వాద సభ'ను వాయిదా వేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు భరోసా పంపిణీ తర్వాత ఈ సభను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుండి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Comments
Loading comments...