వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మున్సిపల్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీఫారాల చించివేత, మహిళలపై దాడి ఘటనపై సీఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వివాదంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

