వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు.
‘420 హామీల’ భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
Comments
Loading comments...

