వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి హైమారావు ఖండించారు.
గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువులపై దాడులు విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

