వార్తలకు తిరిగి వెళ్లండి
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. హెచ్బీ కాలనీలో వ్యక్తిని బెదిరించి ఫోన్, రూ.10 వేలు దోచుకున్న కేసులో శ్రీకాంత్, గోపిలను అరెస్ట్ చేశారు.
అలాగే తురకపాలెంలో ఇంట్లో రూ.80 వేలు చోరీ చేసిన కేసులో సందీప్, గోపిరాజులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

