Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిరేవు పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమం

Follow Udayam on Google
p.g.murthy Sep 03, 2026 1:31 PM మంచిర్యాలGeneral
గుడిరేవు పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమం - Udayam
దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం బుచ్చయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...