వార్తలకు తిరిగి వెళ్లండి

పోరాటానికి ప్రతిరూపమే చాకలి ఐలమ్మని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం పాఠశాలలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

