వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా చంద్రావతి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,500 మంది ముత్తైదువులు పాల్గొని గోత్రనామాలతో వ్రతం ఆచరించారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలకు చీర, గాజులు, ప్రసాదాలను ఈవో శ్రీనివాసరావు అందజేశారు.
Comments
Loading comments...

