వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామపంచాయతీ కార్మికులకు రావలసిన 10 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతకు పాటుపడుతున్న కార్మికుల జీవితాలు మాత్రం అంధకారం చేస్తారా అని అధికారులను నిలదీశారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, మండల నాయకులు పి.రామాంజనేయులు, నాయకులు ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డికలిసి వినతి పత్రం అందజేశారు
Comments
Loading comments...

