వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్టిముక్కుల గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని గ్రామ సర్పంచ్ సుద్దగళ్ళ సంగీత కోరారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి గ్రామ విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరించారు.
వికారాబాద్‌లో విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

