వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ శివారులో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ పరిశీలించారు. కడెం ప్రాజెక్టుతో పాటు ఎగువ ప్రాంతాల నుండి గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తి ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం కలమడుగు గ్రామ శివారులోని గోదావరి నదిని ఆయన పరిశీలించారు. వరద నీటితో గోదావరి నది ఉదృతంగా ఉందని, అటువైపుగా ప్రజలు, పశుకాపర్లు వెళ్ళవద్దని ఆయన కోరారు.
Comments
Loading comments...
