Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండలో ఆషాఢ బోనాల సందడి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 16, 2026 9:20 PM హైదరాబాద్General
గోల్కొండలో ఆషాఢ బోనాల సందడి - Udayam
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాఢ బోనాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జగదాంబిక అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. లంగర్‌హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఈ ఊరేగింపు సాగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో గోల్కొండ పరిసరాలు కోలాహలంగా మారాయి.

Comments

G
Loading comments...