వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఆర్యవైశ్యుల గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గణనాథుడికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.
విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Loading comments...

