వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ గేటులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గండీడ్ మండలానికి చెందిన నిరుద్యోగ JAC నేత కయ్య వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

