వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడిన వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఈ వర్షం పంట పొలాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

