Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులతో యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
రేఖ దేవి Jul 14, 2026 6:45 AM మంచిర్యాలGeneral
వేధింపులతో యువతి ఆత్మహత్య - Udayam
మంచిర్యాల జిల్లా టేకుమట్లలో వెంకటేష్ అనే సింగరేణి కార్మికుడి వేధింపులు తట్టుకోలేక మాధవి(26) అనే బీ ఫార్మసీ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లి చేసుకోవాలంటూ సదరు వ్యక్తి గత రెండేళ్లుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇటీవల సదరు యువకుడు పురుగుల మందు డబ్బాతో యువతి ఇంటికెళ్లి హంగామా సృష్టించాడు. పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ పెట్టినా అతడి ప్రవర్తన మారకపోవడంతో, తట్టుకోలేక యువతి ప్రాణాలు తీసుకుంది.

Comments

G
Loading comments...