వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.536 కోట్లతో 4 చెరువుల సుందరీకరణ

హుస్సేన్‌సాగర్ తరహాలో నగరంలోని ఫాక్స్‌సాగర్, అమీన్‌పూర్, అంబీర్‌చెరువు, సరూర్‌నగర్ చెరువుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైడ్రా, హెచ్‌ఎండీఏ అధికారులు రూ.536 కోట్లతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మొదటి దశలో రూ.227 కోట్లతో చేపట్టే కట్టల బలోపేతం, రోడ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని హెచ్‌ఎండీఏ భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Comments
Loading comments...