Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గారలో వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:36 AM శ్రీకాకుళంGeneral
గారలో వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - Udayam
వంశధార వరదలతో ముంపునకు గురైన గార మండలం తాంసాహెబ్‌పేట, కండ్రపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం పర్యటించారు. వరద పరిస్థితులను పరిశీలించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు తాగునీరు, భోజనం అందించాలని, చిన్నారులకు పాల ప్యాకెట్లు నిరంతరం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...