వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గాజువాకలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సైలు రామకృష్ణ, జగదీశ్, కృష్ణబాబు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

