వార్తలకు తిరిగి వెళ్లండి
ఈశాన్య భారత్‌కు ఇంధన బూస్ట్

నుమాలిగఢ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుండి 9 మిలియన్ టన్నులకు పెంచుతున్నట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) సీఎండీ డాక్టర్ రంజిత్ రథ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రి-కమిషనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 ప్రారంభం నాటికి రిఫైనరీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మరోవైపు పారాదీప్ నుండి నుమాలిగఢ్ వరకు నిర్మిస్తున్న 1,640 కిలోమీటర్ల పొడవైన క్రూడాయిల్ పైప్‌లైన్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి సిద్ధం కానుందని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...