Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహం ముసుగులో రూ.26 లక్షలు చోరీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 11:04 AM కరీంనగర్General
స్నేహం ముసుగులో రూ.26 లక్షలు చోరీ - Udayam
కరీంనగర్‌లో రూ.26 లక్షల చోరీ కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. బాధితుడి చిన్ననాటి స్నేహితుడే మరో మహిళతో కలిసి చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రూ.17.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. మరో నిందితురాలు పరారీలో ఉండగా ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు.

Comments

G
Loading comments...